ధరణితో తప్పిన తిప్పలు

ధరణి పోర్టల్ పేదలకు వరం
దుబ్బాక : ధరణి పోర్టల్ పేదలకు వరంగా మారిందని దుబ్బాక తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి అన్నారు. పైసా ఖర్చు లేకుండా పారదర్శకతతో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. సోమవారం దుబ్బాక తాహసీల్ కార్యాలయంలో ఎనిమిది రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇప్పటివరకు 62 రిజిస్ట్రేషన్లు చేశామని తహసీల్దార్ తెలిపారు.
చేర్యాలలో 79 రిజిస్ట్రేషన్లు పూర్తి
చేర్యాల : ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. ధరణి పోర్టల్ రైతుల పాలిట వరంగా మారింది. ఈ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు సులువుగా, పారదర్శకంగా, అరగంట వ్యవధిలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ ఒకేసారి పూర్తవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వరకు 79 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ శైలజ తెలిపారు.
మిరుదొడ్డిలో 28 రిజిస్టేషన్లు, మూడు ఫౌతీలు
మిరుదొడ్డి : తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటి వరకు 28 రిజిస్టేషన్లు, 3 ఫౌతీలను అధికారులు రైతుల పేరున ఎక్కించి నూతన పట్టాదారు పాసు బుక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సూజాత కోరారు.
కొమురవెల్లి : ధరణితో రైతులకు రిజిస్ట్రేషన్ల తిప్పలు తప్పుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా కాగితాలకే పరిమితమైన స్థలాలను ధరణి పోర్టల్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సోమవారం కొమురవెల్లి తహసీల్ కార్యాలయంలో రెండు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
తొలిగిన ఇబ్బందులు
రాయపోల్ : ధరణితో రైతులకు ఇబ్బందులు తొలిగిపోతున్నాయి. సోమవారం 8 రిజిస్ట్రేషన్లు కావడంతో ఇప్పటి వరకు 49 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
సర్కారు నిర్ణయం భేష్
తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ సారూ నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. దళారుల బాధ తప్పింది. ధరణి పోర్టల్‌తో రైతులకు పూర్తి భరోసా దొరికింది. ఆర్థికంగా ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వం తీసుకునే వ్యవసాయ అభివృద్ధి చట్టాలకు రైతులు వెన్నుదన్నుగా ఉంటారు.
-కొండల్, రైతు తిమ్మక్కపల్లి, రాయపోల్ మండలం
దళారుల బాధలు తప్పాయి..
గతంలో కార్యాలయంలో దళారుల బాధలుండేవి. వీర్వోల ఇష్టారాజ్యంగా ఉండేది. డబ్బులు ఇస్తేనే పనులు చేసేవారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో అన్ని ఇబ్బదులకు శాశ్వత పరిష్కారం లభించింది. సామాన్యులకు ధరణితో ఎంతో ప్రయోజనం జరిగింది.
- ముత్యాలు, రైతు, రాయపోల్
చాలా సంతోషంగా ఉంది..
సీఎం కేసీఆర్ సార్ గిప్పుడు తెచ్చిన గీ పద్ధతి మంచిగున్నది.ఎన్కట దుబ్బాకకు పోయి పొద్దంతా ఆఫీసు కాడ కూసుండి భూముల రిజిస్ట్రేషన్ పనులు జేసుకునేటోళ్లం. సీఎం కేసీఆర్ చల్లగుండాలి. మిరుదొడ్డి తహసీల్ ఆఫీస్‌లో పైసా ఖర్చు లేకుండా సార్లు పని చేస్తుండ్రు. గింత జప్పనా నా భర్త పేరు నుంచి నా పేరు మీదికి ఫౌతీలో 2-30 ఎకరాల భూమిని ఎక్కించుకునే అవకాశం ఇచ్చిన కేసీఆర్ సార్‌కు దండాలు.
-ముత్యపాక శంకరమ్మ , రుద్రారం, మిరుదొడ్డి
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్