గురువారం 28 జనవరి 2021
Siddipet - Nov 24, 2020 , 00:03:29

ముమ్మరంగా ‘ధరణి’ రిజిస్ర్టేషన్లు

ముమ్మరంగా ‘ధరణి’ రిజిస్ర్టేషన్లు

సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేట అర్బన్‌ తహసీల్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ర్టేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తహసీల్దార్‌ విజయసాగర్‌ ఆధ్వర్యంలో భూక్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. సోమవారం సిద్దిపేట, వెల్కటూరు, ఎన్సాన్‌పల్లి, మందపల్లి, తదితర గ్రామాలకు చెందిన ఆరు  ధరణి రిజిస్ట్రేషన్లు అత్యంత స్వల్ప వ్యవధిలో పూర్తి చేయడంతో భూ క్రయ విక్రయదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్‌ పద్మాకర్‌ మాట్లాడుతూ భూక్రయ విక్రయదారులకు ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు వేగవంతంగా చేస్తున్నామన్నారు. ఎలాంటి సందేహాలున్నా తమ కార్యాలయంలో  తెలియజేస్తే పరిష్కరిస్తామని వెల్లడించారు. 

త్వరగా రిజిస్ర్టేషన్‌ అయ్యింది..

మాది ఇల్లంకుంట..  సిద్దిపేట శివారులో భూమి కొనుగోలు చేశా.  ధరణి పోర్టల్‌ ద్వారా త్వరగా రిజిస్ట్రేషన్‌ అయ్యింది. ఇంత త్వరగా అవుతదని నేను అనుకోలేదు. గతంలో రిజిస్ర్టేషన్లు చాలా ఆలస్యమయ్యేవి. తెలంగాణ సర్కా రు ప్రవేశ పెట్టిన నూతన విధానం ద్వారా అందరికీ మంచి సదుపాయం కలిగింది. 

-వడకరాజు వెంకటేశం (ఇల్లంకుంట)


logo