శనివారం 28 నవంబర్ 2020
Siddipet - Nov 22, 2020 , 00:21:35

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

డివిజన్‌లో 2,11,000 క్వింటాళ్ల ధాన్యం సేకరణ: ఆర్డీవో

హుస్నాబాద్‌టౌన్‌: హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 90 కేంద్రాల్లో రెండు లక్షల పదకొండువేల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి చెప్పారు. పట్టణంలోని  కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు.  ఈ సందర్భంగా ఆర్డీవో  మాట్లాడుతూ హుస్నాబాద్‌ డివిజన్‌లో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లలో కోహెడ మండలం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కోహెడ మండలంలో 75వేల క్వింటాళ్లు, బెజ్జంకి మండలంలో 45వేల క్వింటాళ్లు, హుస్నాబాద్‌ మండలంలో 25వేల క్వింటాళ్లు, అక్కన్నపేట మండలంలో 32వేల క్వింటాళ్లు, మద్దూర్‌ మండలంలో 34వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జరిగాయని వివరించారు.  మరో లక్ష క్వింటాళ్ల ధాన్యం వరకు వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. 

సన్నవడ్లను కొనుగోలు చేస్తాం..

సన్నవడ్ల రాశులు పలు కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వాటి కొనుగోలు ప్రక్రియ  త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.   ఆర్‌డీవో వెంట హుస్నాబాద్‌ తహసీల్దార్‌ ఎస్‌కే. అబ్దుల్‌ రహమాన్‌, ఎలక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ కందారపు రజితతో పాటు పలువురు ఉన్నారు.