గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 22, 2020 , 00:21:39

16 రోజులు.. 41 రిజస్ట్రేషన్లు

16 రోజులు.. 41 రిజస్ట్రేషన్లు

  • కొనసాగుతున్న ‘ధరణి’ సేవలు
  • రోజు రోజుకూ పెరుగుతున్న స్లాట్‌ బుకింగ్‌లు
  • సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
  • దళారులు, పైరవీ కారులకు చెక్‌

రాయపోల్‌: రాయపోల్‌ మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 41 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 16 రోజుల్లో 41 రిజిస్ట్రేషన్లు చేసినట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులు మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారని తెలిపారు. వారికి కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్లు సత్వరమే పూర్తి చేస్తున్నామన్నారు. రాయపోల్‌ శివారులో 2 రిజిస్ట్రేషన్లు, మంతూర్‌ గ్రామానికి చెందిన రెండు రిజిస్ట్రేషన్లు చేసి ప్రొసీడింగ్‌ పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు.

VIDEOS

logo