బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 22, 2020 , 00:07:17

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

ఓటరు నమోదును  సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట అర్బన్‌/ కలెక్టరేట్‌ : ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో అనంతరెడ్డి , సిద్దిపేట అర్బన్‌ తహసీల్దార్‌ విజయసాగర్‌ అన్నారు.  కొత్తగా  ఓటరు నమోదు చేసుకోవాలంటే  తేదీ 1-1-2021 నాటికి  18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శనివారం, ఆదివారం  స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఎల్‌వోలు పోలింగ్‌ స్టేషన్లలో  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. తహసీల్‌ కార్యాలయంలో కూడా ఇవ్వొచ్చన్నారు. మండల పరిధిలోని మిట్టపల్లిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నారు. పలువురు కొత్త ఓటర్లు దరఖాస్తుఫాంలు పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందజేశారు.

నారాయణరావుపేటలో..

నారాయణరావుపేట : అర్హత గల వారు ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీల్దార్‌ రేణుక అన్నా రు. మండల పరిధిలోని గుర్రాలగొంది, జక్కాపూర్‌, గోపులాపూర్‌, నారాయణరావుట గ్రామాల్లో ఓటు హక్కు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆమె వెంట ఆర్‌ఐ నరేందర్‌, బూత్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.  

ప్రశాంత్‌నగర్‌ : వార్డులో నెలకొన్న సమస్యలను  పరిష్కారిస్తానని వడ్డెర సంఘం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు ఆలకుంట మహేందర్‌ అన్నారు. శనివారం సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని 28 వార్డులో ఇం టింటా ఓటరు నమో దు కార్యక్రమానికి చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌, రవి, ఆరిఫ్‌,  శేఖర్‌, బిట్టు, అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo