మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Nov 21, 2020 , 00:10:31

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

*18348 మంది రైతులు

* 57,956.840 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

* రూ.75 కోట్ల 37 లక్షల 67 వేలు

        రైతుల ఖాతాల్లో జమరైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నిత్యం శ్రమిస్తున్నారు. రైతును దళారుల బారినుంచి కాపాడేందుకు గ్రామాల్లో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి  గింజనూ కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 223, పీఏసీఎస్‌ ద్వారా 168, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా 6, మెప్మా ద్వారా 4, మెత్తం జిల్లాలో 401 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 57,956.840 మెట్రిక్‌ టన్నుల ధాన్యం  కొనుగోలు చేశారు.

సిద్దిపేట కలెక్టరేట్‌ :    ప్రతి ధాన్యం గింజకు మద్ధతు ధర అందించి రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 18348 మంది రైతుల వద్ద నుంచి 57,956.840 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది. ఇప్పటివరకు రూ.75 కోట్ల 37 లక్షల 67 వేల 605 రైతుల ఖాతాలలో జమ చేసింది. కొనుగోలు చేసిన ధాన్యంకు సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.97,87,92,064 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.75 కోట్ల 37లక్షల 67వేల 605 రైతుల ఖాతాలలో జమ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో రైస్‌ మిల్లర్లు రూ. 81.22 కోట్లకు అక్‌నాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వగా మరో రూ.5.84 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా గురువారం   రూ. 4 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 

రైతుల ఖాతాల్లో 72 గంటల్లో   డబ్బులు  జమ 

కొనుగోలు చేసిన ధాన్యంకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 72 గంటల్లో జమ చేస్తుంది. కొనుగోలు చేసిన ధాన్యంకు వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు సంబంధించిన ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పట్టాదారు పాస్‌ పుస్తకాన్ని సెంటర్‌ నిర్వాహకులు రైతుల వద్దనుంచి తీసుకొని ఎప్పటికప్పుడు ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కొనుగోలు చేసిన ధాన్యంను వెంటవెంటనే రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. సెంటర్లలో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గోనె సంచులను అందుబాటులో ఉంచారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సెంటర్ల నుంచి రైస్‌ మిల్లులకు తరలించేందుకు లారీలను అందుబాటులో పెట్టారు.

ప్రతి  గింజనూ కొనుగోలు చేస్తాం


రైతులు ఇబ్బందులు పడకుం డా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. జిల్లా లో 401 సెంటర్లు ఏర్పాటు చేశాం. కొనుగోలు చేసి న ధాన్యం డబ్బులను 72 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నాం. లారీల కొరత లేకుండా చర్యలు చేప ట్టాం. రైతులు ఆరబెట్టిన ధాన్యం సెంటర్లకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్ధతు ధర పొందాలి.

- పద్మాకర్‌ , అడిషనల్‌ కలెక్టర్‌ 

VIDEOS

logo