ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Nov 21, 2020 , 00:11:38

‘ధరణి’కి విశేష స్పందన

‘ధరణి’కి విశేష స్పందన

సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేట అర్బన్‌ తహసీల్‌  కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్లకు చక్కని స్పందన లభిస్తున్నది. శుక్రవారం మండల పరిధిలోని తడ్కపల్లి, మిట్టపల్లి, సిద్దిపేట తదితర గ్రామాలకు చెందిన 7 రిజి్రఊ్టషన్లు పూర్తి చేశారు. ధరణి రిజిస్ట్రేషన్లను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ విజయసాగర్‌ తెలిపారు.

అక్కన్నపేటలో...


అక్కన్నపేట: మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మండలంలోని అక్కన్నపేట, రామవరం, గోవర్థనగిరి, కట్కూర్‌, చాపగానితండా, రేగొండ, గోవర్థనగిరి, గౌరవెల్లి గ్రామాలకు చెందిన సుమారు 45 మంది రైతులకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తహసీల్దార్‌ వేణుగోపాల్‌రావు తెలిపారు. ఇందులో 42వరకు రిజిస్ట్రేషన్లు కాగా, 3 విరాసత్‌ కింద భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు చెప్పారు. భూముల క్రయ విక్రయాలు చేసుకోనే రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. 

VIDEOS

logo