గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 21, 2020 , 00:07:22

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

  • 30లోపు అన్ని వేదికలు పూర్తి కావాలి
  • జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌: జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికలు నిర్దేశించిన సమయంలో పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ పి వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేస్తూ, పలువురు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో 126 రైతు వేదికలు నిర్మిస్తామని,  మరో పది రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.  ప్రణాళికాబద్ధంగా పనులను వెంటనే పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు వేదికలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చూడాలన్నారు. ఈ నెల 30 లోపు పూర్తి చేయడానికి అవసరమైతే రాత్రి సమయంలో ప్లడ్‌లైట్లు ఏర్పాటు చేసుకుని పనులు జరిగే విధంగా చూడాలన్నారు. నిర్మాణ పనులపై  అధికారులు పర్యవేక్షించాలన్నారు. పనిచేయని కంట్రాక్టర్‌ను మార్చి మరొకరికి ఇచ్చి నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలన్నారు.  

      గ్రామాల వారీగా పనుల పూర్తికి ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కలెక్టర్‌  తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని దొమ్మాట, మిరుదొడ్డి, అల్వాల్‌, చెప్యాల, భూంపల్లి గ్రామాలకు జిల్లా అదనపు కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌ పర్యవేక్షిస్తారన్నారు. పుల్లూర్‌, రాఘవాపూర్‌,చిట్టాపూర్‌, పెద్దగుండవెళ్లి, తిమ్మాపూర్‌ గ్రామాలకు జిల్లా అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, సిద్దిపేట అర్బన్‌ మండల పరిధిలోని బూర్గుపల్లి, పొన్నాల, బక్రీచెప్యాల, మందపల్లి, గ్రామాలకు ఇన్‌చార్జి డీఆర్వో చెన్నయ్య, చిన్న కోడూర్‌ మండలం అల్లీపూర్‌, చిన్న కోడూర్‌, గోనేపల్లి, అనంతసాగర్‌, విఠలాపూర్‌ గ్రామాలకు డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, మాచాపూర్‌, చండ్లపూర్‌, ఇబ్రహీంనగర్‌, మల్లారం, గ్రామాలకు ఆర్‌ డబ్య్లూఎస్‌ ఈ శ్రీనివాస్‌చారిని నియమించారు.

   నంగునూర్‌ మండలం నంగునూర్‌, గట్ల మల్యాల, ఖాత గ్రామాలకు పీఆర్‌ డీఈ వేణుగోపాల్‌, దుబ్బాకలోని చీకోడ్‌, గంబీర్‌పూర్‌, పోతారెడ్డి పేట, ఆకారం, రాజక్కపేట, చెల్లాపూర్‌ గ్రామాలకు జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్‌కుమార్‌, మిరుదొడ్డి మండలం వీరారెడ్డి పల్లి, రుద్రారం, జంగంపల్లి, గ్రామలకు జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య,  తొగుట మండలం తొగుట, వెంక్రావుపేట, ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసాన్‌పల్లి, గుడికందుల గ్రామాలకు డీపీవో సురేశ్‌బాబు, కొండపాక మండలం మాత్‌పల్లి, మేదినీపూర్‌, మర్పడగ, కుకునూర్‌పల్లి, కొక్కొండ గ్రామాలకు గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌, చాట్లపల్లి,మునిగడప, తిమ్మాపూర్‌ గ్రామాలకు గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, కొమురవెళ్లి, మర్రి ముత్యాల గ్రామాలకు పీఆర్‌ డీఈ శ్రీనివాస్‌, చేర్యాల మండలం ఆకునూరు, గురజకుంట, చిట్యాల, కడువేర్గు, నాగపురి గ్రామాలకు ఉద్యానవన శాఖ డీడీ రామలక్ష్మి,  మద్దూర్‌ మండలం మద్దూర్‌, లద్దునూర్‌, దూల్‌మిట,్ట కొండాపూర్‌, బైరాన్‌పల్లి గ్రామాలకు జడ్పీ సీఈవో శ్రావణ్‌, హుస్నాబాద్‌ మండలం పందిళ్ల, మహ్మద్‌పూర్‌, మీర్జాపూర్‌  గ్రామాలకు పీఆర్‌ డీఈ సదాశివరెడ్డిని నియమించారు.

   కోహెడ మండలం కోహెడ, తంగలపల్లి, సముద్రాల, వర్కుల్‌, శ్రీరాంపల్లి గ్రామాలకు పీఆర్‌ ఈఈ కనకరత్నం, అక్కన్నపేట మండలం గౌవవెళ్లి. మల్లంపల్లి, అక్కన్నపేట, రేగొండ, రామవరం గ్రామాలకు హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, బెజ్జంకి మండలం కల్లెపల్లి, పెరికబండ గ్రామాలకు హస్నాబాద్‌ ఏడీఏ మహేశ్‌, గాగిల్లాపూర్‌  బెజ్జంకి, వడ్లూర్‌, బేగంపేట , దాచారం గ్రామాలకు ఆర్‌ డబ్ల్యూఎస్‌ డీఈ నాగభూషణం ప్రత్యేక పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. ఇంకా ఈ సమావేశంలో అధికారులు కనకరత్నం వేణుగోపాల్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo