కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లు ఉపసంహరించాలి

- 23 వేల ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేసిన ఘనత టీఆర్ఎస్ది..
- తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్
సిద్దిపేట టౌన్ : కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరు ప్రకాశ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో విద్యుత్ కార్మిక సంఘ సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వ హిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ.. ఏకకాలంలో 23 వేల ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 26న కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన సమ్మెకు టీఆర్వీకేఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కొన్ని రోజులుగా విద్యు త్ కార్మికులు ఎదుర్కొంటున్న ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కరించుకుందామన్నారు. అంతకు ముందు వంద మంది ఆర్టిజన్ కార్మికులు యూనియన్లో చేరారు. ఈ సమావేశంలో నాయకులు నర్సింగం, రాంరెడ్డి, విష్ణు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.