ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 19, 2020 , 00:14:20

కుక్కల దాడిలో 30 గొర్రెలు మృత్యువాత

కుక్కల దాడిలో 30 గొర్రెలు మృత్యువాత

మద్దూరు : కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బియ్య కిష్టయ్య, బియ్య రాజయ్య గొర్రెల కాపరులు. రోజు మాదిరిగానే గ్రామంలోని బీరప్ప దేవాలయానికి ఎదురుగా ఉన్న గొర్రెల షెడ్డుల్లోకి మంగళవారం సాయంత్రం గొర్రెలను పంపించి ఇండ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున గొర్ల షెడ్డుల వద్దకు వెళ్లి చూడగా షెడ్లలో ఉన్న గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేసి బియ్య కిష్టయ్యకు సంబంధించిన 20 గొర్రెలు, బియ్య రాజయ్యకు సంబంధించిన 10 గొర్రెలను కరిచి చంపాయి. మరో 10 గొర్రెలను తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటనలో సుమారు రూ. 3లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. 

VIDEOS

logo