బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 17, 2020 , 00:10:59

సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పీ వెంకట్రామ్‌రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి దుద్దెడలోని నూతన కలెక్టరేట్‌, పోలీసు కమిషనరేట్‌, నర్సపురంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పరిశీలించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ వీటిని ప్రారంభించనున్న దృష్ట్యా రెండు రోజుల్లో వీటన్నింటినీ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  

సంగారెడ్డి కలెక్టర్‌గా హనుమంతరావు బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి టౌన్‌ : సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎం.హనుమంతరావు సోమవారం  కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వెంకట్రామ్‌రెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.  


VIDEOS

logo