శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Nov 17, 2020 , 00:10:57

అమలులో సిటీ పోలీసు యాక్టు

అమలులో సిటీ పోలీసు యాక్టు

సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఈ నెల 30 వరకు సిటీ పోలీసు యాక్టు అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని చెప్పారు. ముందస్తుగా పోలీస్‌ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

VIDEOS

logo