శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 16, 2020 , 00:09:57

బైకులు ఢీకొని ఒకరు మృతి

బైకులు ఢీకొని ఒకరు మృతి

దుబ్బాక : దీపావళి పండుగ పూట ఒకరు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన దుబ్బాక మండలం నగరం గ్రామంలో శనివారం జరిగింది. ఎస్సై సర్ధార్‌ జమాల్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జీడిపల్లి రవికిరణ్‌(25) హర్వేస్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పక్క గ్రామం చిన్ననిజాంపేటలో ఓ రైతుకు చెందిన వరి పంట కోసేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. 108లో విధులు నిర్వర్తించే అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి అశోక్‌ బంధువుల వద్దకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నగరం గ్రామ శివారులో ఇరువురి బైక్‌లు ఢీకొన్నాయి. రవికిరణ్‌ తలకు తీవ్ర గాయాలు కాగా, దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య అంజలి, కుమారుడు, తల్లిదండ్రులు లక్ష్మీనర్సవ్వ, శంకర్‌ ఉన్నారు. అశోక్‌కు కాలు విరుగడంతో సిద్దిపేట ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జీడిపల్లి రవికిరణ్‌ కుటుంబీకులకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభార్‌రెడ్డి తమ సంతాపాన్ని తెలిపారు. 

VIDEOS

logo