‘సిద్దిపేట’కు జాతీయ అవార్డు

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ జాతీయ పురస్కారానికి ఎంపికైన సిద్దిపేట జిల్లా
దేశంలో 20 జిల్లాలు ఎంపిక కాగా, రాష్ట్రంలో రెండు జిల్లాలు ఎంపిక, సిద్దిపేట ప్రథమం
పల్లెలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలకు ఆరోగ్యం
ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లాకు మరో జాతీయ అవార్డు దక్కింది. సిద్దిపేట అంటే అభివృద్ధి, అవార్డులకు పేరు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పల్లెల్లో స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రపంచ మరుగుదొడ్ల దినం సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో 20 జిల్లాలను ప్రకటించగా, రాష్ట్రం నుంచి సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు ఎంపికయ్యాయి. అందులో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
-సిద్దిపేట కలెక్టరేట్
అవార్డుకు ప్రాతిపదికలు..
సిద్దిపేట జిల్లాలో పల్లె స్వచ్ఛతలో భాగంగా గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ దర్పణ్, గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్వహణ వాటిని 100 శాతం వాడుకోవడం, ఇంకుడు గుంతల నిర్మాణం, పరిశుభ్రతలో భాగంగా శ్రమదాన కార్యక్రమం, ప్రతి శుక్రవారం డ్రై డే, తడి, పొడి చెత్త సేకరణ చేసే కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం పరిగణలోకి తీసుకొని అవార్డుకు సిద్దిపేట జిల్లాను ఎంపిక చేశారు. ప్రస్తుతం కరోనాను దృష్టిలో పెట్టుకొని త్వరలో ఆన్లైన్లో అవార్డును అందించనున్నారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యమనే నానుడిని నిజం చేస్తూ, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు నిదర్శనమే ఈ అవార్డులని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. పల్లెలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆకాంక్షించారు. అవార్డు ఎంపికలో భాగస్వామ్యం అయిన జిల్లాలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీలు, మండల, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం
- దూకుడు పెంచిన వైష్ణవ్.. వరుస సినిమాలతో సందడి..!
- టిక్‌టాక్ మాదిరిగా ఫేస్బుక్ యాప్
- కాణిపాకం వినాయకుడికి రూ.7కోట్ల విరాళం
- పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు
- రాహుల్ వ్యాఖ్యలపై కాషాయ నేత కౌంటర్ : కాంగ్రెస్ అందుకే కనుమరుగైంది!
- బీజేపీకి రెండంకెల సీట్లూ రావు.. నా మాటకు కట్టుబడి ఉన్నా!
- యంగ్ హీరోకు అల్లు అర్జున్ సపోర్ట్.. !