బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 14, 2020 , 00:03:48

అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్సీ నాగపురి సతీమణి మృతి

అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్సీ నాగపురి సతీమణి మృతి

చేర్యాల: మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్‌ సతీమణి వీరలక్ష్మి (70) గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొన్ని రోజుల కింద అనారోగ్యానికి గురైన వీరలక్ష్మిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు శుక్రవారం పట్టణంలోని వ్యవసాయ బావి వద్ద నిర్వహించారు. వీరలక్ష్మి మృతిపై ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

VIDEOS

logo