శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Nov 14, 2020 , 00:03:46

‘పీఈసెట్‌'లో మెరిసిన నవనీత

‘పీఈసెట్‌'లో మెరిసిన నవనీత

  స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించిన రైతు బిడ్డ

చేర్యాల :  బీపీఎడ్‌, డీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీఈసెట్‌ ఫలితాల్లో మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన రైతు జక్కు అయిలవ్వ, నర్సింహులు దంపతులు కుమార్తె నవనీత స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ పాపిరెడ్డి శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. బీపీఎడ్‌ కోర్సులో ప్రవేశానికి మొత్తం 4265 మంది దరఖాస్తు చేసుకోగా, 2970 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2833 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. డీపీఎడ్‌ కోర్సులో ప్రవేశానికి 3103 మంది దరఖాస్తు చేయగా, 1933 మంది హాజరుకాగా 1871 మంది అర్హత సాధించారు. బీపీఎడ్‌ విభాగంలో ఆకునూరు గ్రామానికి చెందిన జక్కు నవనీత రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది. నవనీత ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ పీఈసెట్‌కు హాజరై, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  వ్యాయమ ఉపాధ్యాయుడు, హ్యాండ్‌బాల్‌ కోచ్‌ రఫత్‌  అభినందించారు. 

VIDEOS

logo