గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 14, 2020 , 00:03:44

మార్కెట్‌లో దీపావళి సందడి

మార్కెట్‌లో దీపావళి సందడి

ఊపందుకున్న బంతిపూలు, గుమ్మడికాయల విక్రయాలు

సిద్దిపేట టౌన్‌ /మెదక్‌టౌన్‌ :  చీకట్లను పారద్రోలి అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి సందడి మొదలైంది. ఈ ఏడాది దీపావళి పండుగ ఒకే రోజు వస్తుండటంతో సందడి కాస్త రెట్టింపు అయ్యింది. ఇది వరకు దీపావళి రెండు రోజుల పాటు నిర్వహించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదయం హారతులు, సాయంత్రం లక్ష్మీపూజలు ఉండటంతో పండుగ సామగ్రి కొనుగోలు చేస్తూ  జిల్లాలో పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు పండుగకు కావాల్సిన పూలు, సెమియా కొనుగోలు చేస్తూ కనిపించారు. వ్యాపారులు గుమ్మడికాయలు, దేవతామూర్తుల చిత్రపటాలు, మామిడి ఆకులు, పూలదండలు కొనుగోలు చేస్తూ కనిపించారు. మిఠాయి దుకాణాల వద్ద సందడి నెలకొన్నది. 

  వివిధ ఆకృతుల్లో ప్రమిదలు 

దీపావళి పండుగ అనగానే ఇండ్ల ముందు దీపాలను వెలిగించే ఆనవాయితీ అనాధిగా వస్తోంది. అందులో భాగంగానే వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగించేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తారు. అందుకనుగుణంగానే విక్రయదారులు మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుంచి విభిన్న ఆకృతులు కలిగిన ప్రమి దలను తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. మహిళలు ప్రమిదలను కొనుగోలు చేస్తూ కనిపించారు. 

VIDEOS

logo