బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 13, 2020 , 01:55:22

ధరణి పోర్టల్‌తో పారదర్శకంగా భూ రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్‌తో పారదర్శకంగా  భూ రిజిస్ట్రేషన్లు

జగదేవ్‌పూర్‌: ధరణి పోర్టల్‌తో రైతుల భూ రిజిస్ట్రేషన్లు వేగం గా, పారదర్శకంగా జరుగుతున్నాయని గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి అన్నారు. గురువారం జగదేవ్‌పూర్‌ మండల తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆయన, అధికారులకు సూచనలు చేశారు. అలాగే, రైతులకు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగి పట్టా అమలు కావాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం తెచ్చిన ధరణితో రిజిస్ట్రేషన్‌ అర గంటలో పూర్తవుతున్నాయన్నారు. రైతులు తమ భూముల క్రయవిక్రయాలు జరిపినప్పుడు మీ సేవ ద్వారా గానీ, మొబైల్‌ ద్వారా గానీ స్లాట్‌ బుక్‌ చేసుకోవా లన్నారు. బుక్‌ చేసుకున్న మరుసటి రోజూ కార్యాలయానికి వెళ్తే, అరగంటలో పట్టా, పాసుబుక్‌ చేతికి ఇస్తున్నారన్నారు.

VIDEOS

logo