దళారుల బారిన పడొద్దు

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కిరణ్ గౌడ్
జగదేవ్‌పూర్ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కిరణ్‌గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచులు భిక్షపతి, రాజేశ్వరితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కనకమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీను, ఏఈవో బాను, నాయకులు రఘుపతి, సాయులు, కృష్ణ, కనకయ్య పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన
హుస్నాబాద్ రూరల్: మండలంలోని మహ్మదాపూర్, నాగారం గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఏఈవో ప్రణీత సందర్శించారు. రైతులు కేంద్రానికి తెచ్చిన ధాన్యంలోని తేమను పరిశీలించి వారికి తగు సూచనలు ఇచ్చారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కేంద్రానికి తీసుకురావాలని చెప్పారు. అలాగే మహ్మదాపూర్ లో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
కేంద్రాల్లో రికార్డుల పరిశీలన
అక్కన్నపేట: మండలంలోని కుందన్‌వానిపల్లి, గూడాటిపల్లి, గౌరవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వేణుగోపాల్‌రావు బుధవారం ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. రైతులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ గడ్డం సురేందర్, సర్పంచ్‌లు అన్నాడి దినేశ్‌రెడ్డి, బద్దం రాజిరెడ్డి, బైరగొని పుష్పలీల, ఇన్చార్జులు ఉన్నారు.
రేపు కేంద్రం ప్రారంభం
గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డులో ఈ నెల 13న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ తెలిపారు. గజ్వేల్ మార్కెట్ యార్డలో బుధవారం మాట్లాడుతూ.. పత్తి సేకరణ ప్రారంభం కావడంతో సీసీఐ కొనుగోలు కేంద్రంతో పాటు మక్కల కొనుగోలు కేంద్రాన్ని అదే రోజు ప్రారంభిస్తామన్నారు. మక్కలు 14 శాతం లోపు తేమ ఉండేట్లు తీసుకురావాలన్నారు. క్వింటాల్‌కు రూ.1850 ప్రభుత్వ మద్దతు ధర వర్తిస్తుందన్నారు. 8శాతం తేమ ఉన్న పత్తికి రూ.5825 చెల్లిస్తామన్నారు. క్లస్టర్ పరిధిలోని ఏఈవోల వద్ద టోకన్ తీసుకుని రావాలని రైతులకు అన్నపూర్ణ సూచించారు.
తాజావార్తలు
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
- భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సిఫారసు