ముట్రాజ్‌పల్లి ఆర్ఆండ్ఆర్ కాలనీలో.. విశాలమైన రోడ్లు

గజ్వేల్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం ముట్రాజ్‌పల్లి వద్ద నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు విశాలమైన రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోడ్లు బీటీ, మరికొన్ని రోడ్ల సీసీ పనులు పూర్తి అయ్యాయి. కాలనీలో ప్రతి ఇంటికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడమే కాకుండా నీరు నిలువకుండా ఇంటి వరకు సీసీ, బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. వర్షం, మురికి నీరు పారకానికి ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 60 ఫీట్ల వెడల్పుతో మూడు ప్రధాన బీటీ రోడు,్ల 40పీట్లు, 30 ఫీట్ల వెడల్పుతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ముట్రాజ్‌పల్లి రోడ్డు నుంచి సంగాపూర్ అర్బన్ పార్కు రోడ్డును కలిపే రోడ్డు కాలనీలో ప్రధాన రహదారిగా నిర్మిస్తున్నారు. దీనిని 60 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. మధ్యలో డివైడర్ ఏర్పాటు కాగా మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు చేస్తారు. ఇరుపక్కల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేబుల్ సౌకర్యం కల్పిస్తున్నారు. పచ్చదనం కోసం మొక్కలు పెంచుతారు. మరోరెండు 60 ఫీట్ల రోడ్లతో పాటు మిగతా రోడ్లకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. మిషన్‌భగీరథ నుంచి ఇంటింటికీ నల్లా కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. వర్షం నీరు పారడానికి ప్రత్యేక కాలువలతో పాటు మురికి నీరు కోసం యూజీడీ పనులను చేపట్టారు. కాలనీకి 4 ప్రాంతాల్లో మురికి నీటి శుద్ధికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- కొవాగ్జిన్ సామర్థ్యం.. 81%
- ‘రాసలీలల’ మంత్రి రాజీనామా
- ప్రభుత్వంతో విభేదించడం దేశద్రోహం కాదు
- 24/7 వ్యాక్సినేషన్ కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- సోషల్ మీడియా నియంత్రణపై రాష్ర్టాలకు అధికారం లేదు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- వెన్నునొప్పి ఉంది.. గుర్రం మీదొస్తా !
- జనాభాలో వాళ్ల వాటా 19.. సంక్షేమ పథకాల్లో 35 శాతం