శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 11, 2020 , 00:08:32

చివరి రోజూ.. భారీగా దరఖాస్తులు

చివరి రోజూ.. భారీగా దరఖాస్తులు

  ముగిసిన సాదాబైనామా గడువు

  కిటకిటలాడిన మీసేవ కేంద్రాలు

  గడువు పెంచాలని రైతుల విన్నతి

హుస్నాబాద్‌ టౌన్‌ : సాదాబైనామాకు ప్రభుత్వం విధించిన  చివరి గడువు మంగళవారం రోజున రైతులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పలు గ్రామాలకు చెందిన రైతులు పట్టణంలోని మీ సేవ కేంద్రాలకు వచ్చి సాదాబైనామాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. హుస్నాబాద్‌ మండలంలో ఇప్పటివరకు 1100 వరకు దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్‌ ఎస్‌కే అబ్దుల్‌ రెహమన్‌ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సైతం రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని.. దరఖాస్తుల సంఖ్య మ రింతగా పెరుగుతుందని తహసీల్దార్‌ తెలిపారు. 

  మీ సేవ కేంద్రాల్లో సందడి..

మద్దూరు : సాదాబైనామాల క్రమబద్ధ్దీకరణకు చివరి రోజు కోవడంతో మండలంలోని పలు మీ సేవ కేంద్రాల్లో రైతులు బా రులు దీరారు. సాదాబైనామాల కోసం ప్రభుత్వం కల్పించిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రైతులు ఎగబడ్డారు. మండల వ్యాప్తంగా సుమారు 2500 మంది రైతులు సాదాబైనామాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సాదాబైనామాల క్రమబద్ధ్దీకరణకు వారం రోజుల గడువును పెంచాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

   సాదాబైనామాలకు బారులు తీరిన రైతులు 

జగదేవ్‌పూర్‌ : సాదాబైనామాల దరఖాస్తుల స్వీకరణకు చివరిరోజు కావడంతో మీసేవ కేంద్రల వద్ద రైతులు భారీగా బారు లు తీరారు. గతంలో తెల్లకాగితాలు, బాండ్‌పేపర్ల మీద పెద్ద మ నుషుల సమక్షంలో ఒప్పందాల ప్రకారం భూముల క్రయ, విక్రయాలు జరిగాయి. కానీ, అనేక మంది రైతులు సాదాబైనామాల భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. రిజిస్ట్రేషన్‌ కాని భూ ములు, పట్టా చేసుకోని రైతులకు లబ్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ సాదాబైనామాలను పట్టా చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.  20 రోజులుగా వందలాది మంది రైతులు భూముల పట్టాకోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. కరోనా నేపథ్యం లో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా కావడంతో ప్రభుత్వం  మరో వారం రోజుల గడువు పెంచింది. ఈ నేపథ్యంలో చివరి అవకాశం కావడంతో మీసేవ కేంద్రాల వద్ద రైతులు భారీ సంఖ్య లో వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 1519 దరఖాస్తు రాగా, చివరి రోజే 268 పైగా దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.  

VIDEOS

logo