మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Nov 11, 2020 , 00:08:31

ఉత్కంఠ రేపిన ఉప ఎన్నిక

ఉత్కంఠ రేపిన ఉప ఎన్నిక

చివరి వరకూ హోరాహోరీ

టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వా..నేనా 

అన్నట్లుగా సాగిన ఓట్ల లెక్కింపు

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం 

1079 స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపు 

టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైన స్వతంత్ర అభ్యర్థులు 

పార్టీల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు

1. రఘునందన్‌రావు (బీజేపీ) 63,352         

2. సోలిపేట సుజాత  (టీఆర్‌ఎస్‌) 6,2273

3. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌) 22,196 

4. బండారు నాగరాజు 

(చపాతీ రోలర్‌ గుర్తు) 3570 

 బీజేపీ అభ్యర్థి మెజార్టీ 1079 ఓట్లతో గెలుపు 

సిద్దిపేట కలెక్టరేట్‌/దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపాయి. నువ్వా..నేనా అన్నట్టుగా ఓట్ల లెక్కింపు సాగింది. 20-20 మ్యాచ్‌ను తలపించేలా ఫలితాలు వచ్చాయి. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ఆసక్తిని రేపాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1079 స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రిటర్నింగ్‌ అధికారి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సుజాతకు 62,273, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. మంగళవారం జిల్లాకేంద్రమైన సిద్దిపేటలోని ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేపట్టిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగానే, అధికారులు మొదటగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభించారు. 1వ రౌండ్‌ నుంచి 5 రౌండ్ల వరకు బీజేపీ ఆధిక్యం చూపగా, 6,7వ రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యతను కనబర్చింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉండడంతో చివరి వరకూ టెన్షన్‌కు గురిచేశాయి. 8,9వ రౌండ్లలో బీజేపీ, 10వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌, 11వ రౌండ్‌లో బీజేపీ, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యత కనబర్చాయి. 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో వరుసగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యతను చాటారు. 20, 21, 22, 23 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యం కనబర్చారు. నాలుగు ఈవీఎంలు మొరాయించడంతో వీవీ ప్యాట్లను లెక్కించారు. (24, 25 రౌండ్లలో) టీఆర్‌ఎస్‌ ఆధిక్యతను చాటింది. చివరగా టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా కొనసాగి విజయం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును వరించింది. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు.  

టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైన 

స్వతంత్ర అభ్యర్థులు.. 

దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటమికి స్వతంత్ర అభ్యర్థులే కారణంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 23మంది పోటీ చేశారు. అభ్యర్థులు అధికంగా ఉండడంతో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేయడంతో టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లింది. మొదటి ఈవీఎంలో 3వ నంబరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత ఉండగా, రెండో ఈవీఎంలో స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజు చపాతీ రోలర్‌ గుర్తు ఉంది. దీంతో చాలామంది ఓటర్లు రెండో ఈవీఎంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి నాగరాజుకు ఓటు వేసినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఈవీఎంలో 3వ నంబర్‌ అనుకుని రెండో ఈవీఎంలో ఉన్న 17 నంబరులో ఓట్లు పోలయ్యాయి. స్వతంత్య్ర అభ్యర్థుల్లో చపాతీ రోలర్‌ గుర్తు బండారు నాగరాజుకు 3,489 ఓట్లు పోలవ్వడం విశేషం. స్వతంత్ర అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌కు నష్టం చేకూరింది. దుబ్బాకలో రెండుసార్లు ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు, ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌ కలిసొచ్చింది. గత  2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఉపఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఆయనపై సానుభూతి చూపారు. 

1) ఎం. రఘునందన్‌రావు బీజేపీ 63352 38.47

2) సోలిపేట సుజాత టీఆర్‌ఎస్‌  62273 37.82

3) చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌  22,196 13.48

4) కత్తి కార్తికేయ ఎఐఎఫ్‌బీ 636 0.39

5) బి. నాగరాజు స్వతంత్ర 3570 2.17

 విజేత ఎం. రఘునందన్‌రావు బీజేపీ 1079 ఓట్ల మెజార్టీ 


దుబ్బాక ఉప ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా..


క్ర. అభ్యర్థి పేరు పార్టీ పేరు ఈవీఎం ఓట్లు పోస్టల్‌ ఓట్లు మొత్తం ఓట్లు శాతం

1 చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ 22,054 142 22,196 13.48

2 ఎం.రఘునందన్‌రావు బీజేపీ 62,984 368 63352 38.47

3 సోలిపేట సుజాత టీఆర్‌ఎస్‌ 61,553 720 62273 37.82

4 కత్తి కార్తికేయ ఏఐఎఫ్‌బీ 621 15 636 0.39

5 గౌటి మల్లేశం జైస్వరాజ్‌ 308 03 311 0.19

6 జాగుల భాస్కర్‌ శ్రమ జీవన్‌ 1978 13 1991 1.21

7 సునీల్‌ ఐపీబీపీ 183 01 184 0.11

8 ఎస్‌ ఆశోక్‌ రిపబ్లికన్‌ పార్టీ 95 02 97 0.06

9 రవితేజ గౌడ్‌ స్వతంత్ర 102 02 104 0.06

10 ఎ. రాజు స్వతంత్ర 226 03 229 0.14

11 సుదర్శన్‌ స్వతంత్ర 387 05 392 0.24

12 కె.యాదగిరి స్వతంత్ర 335 05 340 0.21

13 కె.శ్యామ్‌ కుమార్‌ స్వతంత్ర 1437 05 1442 0.88

14 కె.సాయన్న స్వతంత్ర 1703 06 1709 1.04

15 పీఎం బాబు స్వతంత్ర 690 01 691 0.42

16 మాధవరెడ్డి స్వతంత్ర 899 03 902 0.55

17 బి.నాగరాజు స్వతంత్ర 3510 60 3570 2.17

18 ఎం.నరేశ్‌ స్వతంత్ర 1005 01 1006 0.61

19 లక్ష్మణ్‌రావు స్వతంత్ర 1212 09 1221 0.74

20 ఆర్‌. శ్రీనివాస్‌ స్వతంత్ర 160 0 160 0.1

21 మాధవచారి స్వతంత్ర 395 4 399 0.24

22 విక్రమ్‌ రెడ్డి స్వతంత్ర 354 01 355 0.22

23 శ్రీకాంత్‌ స్వతంత్ర 544 11 555 0.34

24 ‘నోటా’ 553 01 554 0.34

మొత్తం 1,63,288 1,381 1,64,669

రౌండ్ల వారీగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు  

క్ర.సం కాంగ్రెస్‌ బీజేపీ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం పార్టీ   

1. 648 3208 2867 341 బీజేపీ 

2. 667 3284 2490 794 బీజేపీ 

3. 616 2731 2607 124 బీజేపీ

4. 227 3832 2407 1425 బీజేపీ

5. 566 3462 3126 338 బీజేపీ

6. 530 3709 4062 353 టీఆర్‌ఎస్‌ 

7. 749 2536 2718 182 టీఆర్‌ఎస్‌

8. 1122 3116 2495 621 బీజేపీ

9. 675 3413 2329 1084 బీజేపీ

10. 899 2492 2948 456 టీఆర్‌ఎస్‌ 

11. 1883 2965 2766 199 బీజేపీ

12. 2080 1997 1900 83 కాంగ్రెస్‌ 

13. 1212 2520 2824 304 టీఆర్‌ఎస్‌ 

14. 784 2249 2537 288 టీఆర్‌ఎస్‌ 

15. 1500 2072 3027 955 టీఆర్‌ఎస్‌ 

16. 674 2408 3157 749 టీఆర్‌ఎస్‌ 

17. 1705 1946 2818 862 టీఆర్‌ఎస్‌ 

18. 852 2527 3215 688 టీఆర్‌ఎస్‌ 

19. 976 2335 2760 251 టీఆర్‌ఎస్‌ 

20. 1058 2931 2440 491 బీజేపీ

21. 845 2428 2048 380 బీజేపీ

22. 971 2958 2520 438 బీజేపీ

23. 580 1653 1241 412 బీజేపీ

24. 89 133 142 09 టీఆర్‌ఎస్‌

25. 146 79 109 37 కాంగ్రెస్‌

మొత్తం 22054 62984 61553


పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు

142 368 720 352 టీఆర్‌ఎస్‌

VIDEOS

logo