పభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులకు అరుదైన గౌరవం

సిద్దిపేట టౌన్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వవిద్యార్థులు సుధాకర్‌రెడ్డి, చింతమడక బిడ్డ బెజరాం మహిపాల్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలపై అధ్యయనం చేశారు. అందులో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు మహిపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి అంచెలంచెలుగా భారత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఉత్తమ శాస్త్రవేత్తలుగా ఎంపికయ్యారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిపాల్‌రెడ్డి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశారన్నారు. 1984 నుంచి జూనియర్ శాస్త్రవేత్తగా శాస్త్రీయ వృత్తిని ఆయన ప్రారంభించారని తెలిపారు. 2017 నుంచి ప్రధాన శాస్త్రవేత్తగా భౌతిక రసాయన విభాగ అధిపతిగా కొనసాగారని చెప్పారు. అనేక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫెల్లోషిప్‌లను మహిపాల్‌రెడ్డి పొందాడని చెప్పారు. ప్రస్తుతం రాజరామన్న విశిష్ట ఫెల్లోషిప్పై ఐఐటీలో పరిశోధన కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన విద్యార్థులిద్దరికీ అరుదైన గౌరవం దక్కడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్