గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 10, 2020 , 00:17:46

సోలిపేట సుజాతమ్మ ఘన విజయం ఖాయం

సోలిపేట సుజాతమ్మ ఘన విజయం ఖాయం

తొగుట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతమ్మ ఘన విజయం  ఖాయమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. తొగుటలో సోమవారం  విలేకరులతో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ప్రజల నుంచి వచ్చే ఆధరణ చూడలేక బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు కుట్రలకు తెరతీశారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా దుబ్బాక ప్రజలు నమ్మలేదన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో దుబ్బాక అభివృద్ధిని ప్రజలు ఆకాంక్షించారన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని అన్నారు. అంతకు ముందు విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన గ్రామ విద్యుత్‌ హెల్పర్‌ హబీబ్‌ ఉద్దీన్‌ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆయన వెంట సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సిరినేని గోవర్ధన్‌, సొసైటీ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, ఎంపీటీసీ వెల్పుల స్వామి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ పోచయ్య, కో ఆప్షన్‌ సభ్యులు ఎండీ కలీమొద్దీన్‌, నర్సింహులు పాల్గొన్నారు.

VIDEOS

logo