బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 09, 2020 , 00:37:24

గ్రామం కొత్తది.. సంకల్పం గొప్పది

గ్రామం కొత్తది.. సంకల్పం గొప్పది

 150 వారాలుగా నిరంతర శ్రమదానం

నంగునూరు : గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే గ్రామాభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రతి వారం క్రమం తప్పకుండా శ్రమదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంది ఆ గ్రామం. 150 వారాలుగా నిరంతరాయంగా శ్రమదానం చేస్తూ గ్రామాన్ని ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. నంగునూరు మండలంలోని అప్పలాయచెరువు గ్రామం నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ. ఇంతకుముందు మండలంలోని మగ్ధూంపూర్‌ గ్రామానికి మధిర గ్రామంగా ఉండేది. కొత్త గ్రామపంచాయతీ అయినప్పటికీ గ్రామస్తుల సహకారం, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో గ్రామం అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నది. గ్రామస్తులంతా ఏకతాటిపై ముందుకు వెళుతూ 150 వారాలుగా నిరంతరంగా శ్రమదానం చేస్తూ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమానికి ముందు నుంచే గ్రామంలో ప్రతి గురువారం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేస్తూ ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. శ్రమదానంతో పాటు గ్రామంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నది. కొత్త గ్రామమైనప్పటికీ గ్రామ సర్పంచ్‌ గట్టు మల్లవ్వ, పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చొరవ, మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశంతో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నది. గ్రామంలో డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక నిర్మాణాలు పూర్తి కావడంతో పాటు వాటిని వినియోగిస్తున్నారు. హరితహారం, డ్రై డే వంటి కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 


VIDEOS

logo