శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 09, 2020 , 00:37:24

మత్తడి నీటి మళ్లింపుతో చేర్యాల పట్టణానికి తప్పనున్న తిప్పలు

మత్తడి నీటి మళ్లింపుతో చేర్యాల పట్టణానికి తప్పనున్న తిప్పలు

చుక్క నీరు పట్టణంలోకి రాకుండా చర్యలు   

అన్ని వర్గాలు సహకరిస్తే  పట్టణాభివృద్ధి  

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల : పెద్ద చెరువు మత్తడి నీటి మళ్లింపుతో చేర్యాల టౌన్‌ ప్రజలకు తిప్పలు తీరుతాయని, సమస్యను పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్‌కు తెలుపడంతో తెలంగాణ సర్కారు కాలువ నిర్మాణానికి రూ.50లక్షలను మంజూరు చేసిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఇటీవల పనులను ఐబీ అధికారులు ప్రారంభించడంతో ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద చెరువు మత్తడి నీటి మళ్లింపు కాలువ నిర్మాణం కుడి చెరువు వరకు కొనసాగనున్నదన్నారు. పనులను సంబంధిత శాఖ అధికారులు నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. పట్టణాలను వరద, మత్తడి నీటి ముప్పు నుంచి కాపాడడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, ఇదే స్ఫూర్తితో హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో ఇటీవల కాల్వల నిర్మాణ పనులను అధికారులు చేపట్టారన్నారు. పాత నియోజకవర్గ కేంద్రం చేర్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే వెంట మద్దూరు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీశ్‌గౌడ్‌, మంగోలు చంటి, ఆడెపు నరేందర్‌, మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ముస్త్యాల నాగేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్‌ ముస్త్యాల కిష్టయ్య, మాజీ డైరెక్టర్‌ రామగల్ల బాబు, పుర్మ వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

VIDEOS

logo