రైతు ముంగిట్లో ‘ధరణి’ సేవలు

కొల్చారం: సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సేవలు రైతు ముంగిట్లోకి వచ్చేశాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణితో మండల కేంద్రాల్లోని తహసీల్ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడంతో దూరాభారం, వ్యయ ప్రయాసలు, సమయం ఆదా అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కూడా సులభంగా, పారదర్శకంగా వేగవంతంగా అవుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం రోజుల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ నుంచి మొదలుకుని అధికారులకు అమ్యామ్యాలు ఇవ్వాల్సి ఉండేది. కానీ మండల కేం ద్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతోపాటు వెంటనే పాసుపుస్తకం ఇస్తుండడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలలుగా వెలవెలబోయిన తహసీల్ కార్యాలయం ప్రస్తుతం రైతులతో కళకళలాడుతోంది. ధరణి పోర్టల్ ప్రారంభమైన మొదటి రోజు సాంకేతిక సమస్య రాగా, మరుసటి రోజునుంచి వరుసగా మూడు, నాలుగు, గురువారం నాలుగు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఆ వెంటనే రిజిస్ట్రేషన్ కాగితాలు, పాసుపుస్తకాలను తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ప్రదీప్ అందజేశారు. కార్యక్రమంలో ధరణి ఆపరేటర్ మల్లేశ్ యాదవ్ ఉన్నారు.
అంతరాయం లేకుండా రిజిస్ట్రేషన్లు
కౌడిపల్లి: ఎలాంటి అంతరాయం లేకుండా ధరణి పోర్టల్‌లో ఐదు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని త హసీల్దార్ విజయలక్ష్మి పేర్కొన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో ఐదుగురు వ్యవసాయ భూమికి సంబంధించి స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. తునికి 1, వెంకటాపూర్ 1, సలాబత్పూర్ 1, ధర్మసాగర్ 2 లకు సంబంధించిన వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసి పాస్‌బుక్‌లను అందించామని తెలిపారు.
తాజావార్తలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు కాణిపాకం నుండి పట్టువస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన