సోమవారం 08 మార్చి 2021
Siddipet - Nov 06, 2020 , 00:55:50

పెద్ద చెరువు మత్తడి నీటికి శాశ్వత పరిష్కారం

పెద్ద చెరువు మత్తడి నీటికి శాశ్వత పరిష్కారం

చేర్యాల :  కొన్ని దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పెద్ద చెరువు మత్తడి నీటి ప్రవాహానికి టీఆర్‌ఎస్‌ సర్కారు శాశ్వత పరిష్కారం చూపించింది. మత్తడి నీటిని మళ్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోరారు. దీంతో ఎమ్మెల్యే మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి మత్తడి నీటితో చేర్యాల పట్టణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, భవిష్యత్తులో వర్షాలు భారీగా కురిస్తే జరిగే ప్రమాదాన్ని వివరించారు. మంత్రి కేటీఆర్‌ వెంటనే చేర్యాల పెద్ద చెరువు మత్తడి నీటి మళ్లింపునకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్ద చెరువు నిండుకుండలా మారడంతో పాటు సుమారు 30 రోజుల పాటు అలుగు పారడం పట్టణంలోని ప్రధాన రహదారిపై మెకాళ్ల ఎత్తున నీరు ఉధృతంగా కిలోమీటరు మేరకు ప్రవహించడంతో సమీపంలో ఉన్న గృహాల్లోకి నీరు చేరింది. నెల రోజుల వ్యవధిలో పలుమార్లు మత్తడి దూక డం నీళ్లు వ్యాపార సముదాయాలు, సెల్లార్లు, గృహాల్లోకి రావడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కున్నారు.

  చేర్యాలకు తప్పనున్న మత్తడి నీటి ముప్పు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల పెద్ద చెరువు మత్తడి నీటిని మళ్లింపు కోసం రూ.50లక్షల నిధులు విడుదల చేయించడం, అధికారులు పనులు సైతం ప్రారంభించడంతో పట్టణానికి వరద ముప్పు తప్పిపోయింది. చేర్యాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న పెద్ద చెరువును ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిఏడాది గోదావరి జలాలతో నింపుతుండడంతో  బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. గోదావరి జలాలకు తోడుగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్ద చెరువు పూర్తి స్థ్ధాయిలో నిండడంతో పాటు నెల రోజుల పాటు మత్తడి దూకడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  

 ఎవరికి ఇబ్బందులు లేకుండా కాల్వ నిర్మాణం

పెద్ద చెరువు మత్తడి నీటిని మళ్లించే విషయంలో ఎవరికీ ఎలాంటి నష్టం కలుగకుండా ఉండే విధంగా కాల్వ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడంతో సంబంధిత ఐబీ అధికారులు అదే విధంగా పనులు చేసేందుకు మార్కింగ్‌ చేశారు. మత్తడి నీరు ఏ స్థాయిలో వస్త్తోంది, నీటి పరిస్థ్ధితి, దాని ఉధృతి, క్యాచ్‌మెంట్‌ ఏరియా తదితర వాటి పై అధికారులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించి నివేదికలు తయారు చేశారు.  దీనికనుగుణంగా 12 ఫీట్ల వెడల్పు, 8 ఫీట్ల లోతుతో కాల్వ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పెద్ద చెరువు మత్తడి నీటిని నూతనంగా ప్రారంభించిన కాల్వ ద్వారా కుడి చెరువులోకి తరలించే విధంగా పనులు కొనసాగించారు.

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చేర్యాలలోని పెద్ద చెరువు మత్తడి నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలతో పాటు అఖిలపక్ష నాయకులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కోరడంతో  అధికారులతో సర్వే చేయించారు.  ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాల్వను నిర్మించే విధంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

VIDEOS

logo