రాష్ట్రంలో పటిష్ట పోలీసు వ్యవస్థ

కొండపాక : సీఎం కేసీఆర్ సంకల్పించినట్లుగానే స్కాట్‌ల్యాండ్ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను పటిష్ట పరిచే దిశగా నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ జైన్, చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్‌లతో కలిసి కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న నూతన పోలీస్ కమిషనరేట్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా దామోదర్ గుప్తా మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవన నిర్మాణం 20ఎకరాలపై బడిన ప్రాంగణంలో 15 కోట్ల రూపాయల అంచనాలతో, 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 120 పిల్లర్స్, 3 అంతస్తులతో దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. అత్యాధునిక సాంకేతికతతో చేపట్టిన ఈ కమిషనరేట్ కార్యాలయం త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని ఆయన తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ని పరిరక్షించే పోలీసు శాఖను పటిష్టం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పోలీసులకు అత్యాధునిక వాహనాలను, ఆయుధాలను, ఆధునిక భవనాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కోసం ట్వీన్ టవర్స్( ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఆధునిక డీపీవో కార్యాలయాలు (జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం) నూతన పోలీసు స్టేషన్ల భవనాలను నిర్మించడంలో పోలీస్ హౌసింగ్ బోర్డు సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. 14 కొత్త జిల్లా కేంద్రాల్లో డీపీవో భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నవంబర్ చివరి వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, సంబంధింత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్, ఎస్ఈ తులసీధర్ రెడ్డి, డీఈ రాజయ్య, ప్రాజెక్ట్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా పూర్తికావాలి
మర్కూక్ : నవంబర్ నెలాఖరులోగా మర్కూక్ పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు పూర్తికావాలని రాష్ట్ర పోలీస్‌హౌసింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా నిర్మాణాదారులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని శివారు వెంకటాపూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న నూతన పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హెచ్చరించారు. ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చేతులమీదుగా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్‌కుమార్‌జైన్,చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్, ఎస్ఈ తులసీధర్రెడ్డి, డీఈ. రాజయ్య,ఏజెన్సీ సభ్యులు ప్రసాద్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!