సోమవారం 01 మార్చి 2021
Siddipet - Nov 06, 2020 , 00:55:48

‘ధరణి’ సేవలతో అక్రమాలకు చెక్‌

‘ధరణి’ సేవలతో అక్రమాలకు చెక్‌

ములుగు : ధరణి సేవలతో అక్రమాలకు, భూసమస్యలను అరికట్టవచ్చని కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. గురువారం మండల కేంద్రం ములుగు తహసీల్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి  ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధరణి సేవల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రారంభ దశలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వెంటనే వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ధరణి సేవలను మరింత విస్తృతం చేసి వేగంగా, మరింత సులభంగా అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.  ధరణి ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలు తహసీల్‌ కార్యాలయంలో క్లుప్తంగా ఉండాలని తప్పనిసరిగా రికార్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి సేవలకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ యాదగిరిరెడ్డి కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

VIDEOS

logo