గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 05, 2020 , 00:27:42

'కొండపోచమ్మ'కు ఆదాయం రూ.7.81 లక్షలు

'కొండపోచమ్మ'కు ఆదాయం రూ.7.81 లక్షలు

జగదేవ్‌పూర్‌ : మండల పరిధిలోని తీగుల్‌ నర్సాపూర్‌లో గల కొండపోచమ్మ ఆలయంలో బుధవారం హుండీని లెక్కించారు. సిద్దిపేట డివిజన్‌ దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, ఈవో మోహన్‌రెడ్డిల పర్యవేక్షణలో కొండపోచమ్మకు 5నెలల17రోజుల్లో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం అమ్మవారి ఆలయానికి రూ.7లక్షల,81వేల 860ల ఆదాయం వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ రజిత రమేశ్‌, ఎంపీటీసీలు కావ్య దుర్గయ్య, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, కనకయ్య, అంజయ్య, సుధాకర్‌, చిన్న, అర్చకులు యాదగిరి, లక్ష్మణ్‌, కృష్ణమూర్తి భక్తులు పాల్గొన్నారు.

VIDEOS

logo