ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Nov 05, 2020 , 00:27:38

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ :

దుబ్బాక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను సిద్దిపేటలోని ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్‌రూమ్‌కు బుధవారం తెల్లవారుజామున చేర్చారు. మంగళవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసిన అనంతరం 315 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలను దుబ్బాక లచ్చపేటలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ సెంటర్‌లో ఎన్నికల పోలింగ్‌ సిబ్బంది ఈవీఎం లు, వీవీప్యాట్లను అందజేశారు. మంగళవారం రాత్రి వరకు ఈవీఎం, వీవీప్యాట్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. అనంతరం ఈవీఎం లను, వీవీప్యాట్లను మూడంచెల పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను సిద్దిపేట లోని ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు బుధవారం ఉదయం తరలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యామ్లా ఇక్బాల్‌, సిద్దిపేట కలెక్టర్‌ భారతీ హోళికేరి, సీపీ జోయల్‌ డెవిస్‌, రిటర్నింగ్‌ అధికారి చెన్న య్య, దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల పోటీ లో ఉన్న పలువురు అభ్యర్థులు, అభ్యర్థుల తరపు న వచ్చిన ప్రతినిధుల సమక్షంలో అధికారులు బుధవారం ఉదయం స్ట్రాంగ్‌రూ మ్‌కు సీల్‌ వేశా రు. ఈ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తును ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల 10న ఇందూర్‌ ఇంజినీ రింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండ డంతో కౌంటింగ్‌ ఏర్పాట్లలో అధికారులు నిమగ్న మయ్యారు. 

బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం 

దుబ్బాక : దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఎన్నికల సిబ్బంది మంగళవారం రాత్రి దుబ్బాకలోని లచ్చపేట రిసెప్షన్‌ కౌంటర్‌లో అందజేశారు. అనంతరం బుధవారం వేకువజామున పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను లచ్చపేట మోడల్‌ స్కూల్‌ నుంచి సిద్దిపేట ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యామల ఇక్బాల్‌, కలెక్టర్‌ భారతీహోళికేరి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్యతో పాటు దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షలో బుధవారం ఉదయం స్ట్రాంగ్‌ రూమ్‌కు సీల్‌ వేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబ స్తును ఏర్పాటు చేశారు. దుబ్బాక శాసనసభకు పోటీచేసిన 23 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉంది. కేంద్ర బలగాలు పటిష్ట బందోబస్తు చేపట్టారు. 10న ఇందూర్‌ కళాశాలలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవతవ్యం తేలనున్నది. 

స్ట్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మూడంచెల భద్రత 

కేంద్ర బలగాలు సీఆర్‌పీఎఫ్‌, రాష్ట్ర సాయుధ బలగాలు, సివిల్‌ పోలీసులు, మొత్తం 100 మంది అధికారులు, సిబ్బందితో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పటిష్టమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. ప్రతి రోజు సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌, దుబ్బాక పోలీసు ఉప ఎన్నికల నోడల్‌ అధికారి ఏసీపీ బాలాజీ, సీఐలు, ఎస్సైలు 24x7 బందోబస్తు పర్యవేక్షణ చేస్తారు. ఈనెల 10న ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండడంతో కౌంటింగ్‌ ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం, కౌంటింగ్‌ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. 

- జోయల్‌ డెవిస్‌, సిద్దిపేట పోలీసు కమిషనర్‌   

VIDEOS

logo