బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 04, 2020 , 00:24:51

సీసీ కంట్రోల్‌ రూం ద్వారా పోలింగ్‌ పర్యవేక్షణ

సీసీ కంట్రోల్‌ రూం ద్వారా పోలింగ్‌ పర్యవేక్షణ

జీపీఎస్‌ సిగ్నల్స్‌ పరిశీలించిన వెస్ట్‌జోన్‌ ఐజీ స్ట్టీఫెన్‌ రవీంద్ర

సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ సీసీ కంట్రోల్‌ రూంలో దుబ్బాక ఉప ఎన్నికల తీరు, మొబైల్‌ పార్టీ వాహన కదలికలను జీపీఎస్‌ ద్వారా లొకేషన్‌ను వెస్ట్‌జోన్‌ ఐజీ స్ట్టీఫెన్‌ రవీంద్ర, నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డితో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక  పోలింగ్‌పై ఆరా తీశారు. మొబైల్‌ పార్టీ వాహనాలు, స్ట్రైకింగ్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ వాహనాలకు జియోట్యాగింగ్‌ చేయడం, వాహనాల కదలికలు, లొకేషన్లు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయో జీపీఎస్‌ సిగ్నల్స్‌ ద్వారా పరిశీలించారు. అనంతరం హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అత్యాధునిక టెక్నాలజీతో పర్యవేక్షించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

పోలింగ్‌ సరళిని 

పరిశీలించిన సిద్దిపేట సీపీ 

రాయపోల్‌: దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని సిద్దిపేట సీపీ జోయల్‌ డెవిస్‌ పేర్కొన్నారు. రాయపోల్‌ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

VIDEOS

తాజావార్తలు


logo