శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 04, 2020 , 00:08:10

కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి

కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి

సిద్దిపేట టౌన్‌ : బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన రాజీవ్హ్రదారిపై మంగళవారం జరిగింది. సిద్దిపేట టూటౌన్‌ ఎస్సై సాంబయ్యగాడ్‌ వివరాల ప్రకారం.. ఆంధ్రరాష్ట్రం కృష్ణ జిల్లా కవ్వంపాడు గ్రామానికి చెందిన తిరుపతి రవి (40), అదే జిల్లాకు చెందిన ముచ్చన్నపల్లి గ్రామానికి చెందిన బత్తుల పెద్దిరాజు (29) బతుకుదెరువు నిమిత్తం కొంత కాలంగా నంగునూరు మండలం వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. చంద్లాపూర్‌ వద్ద జరుగుతున్న కెనాల్‌ పనుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే బైక్‌పై పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు రాజీవ్‌ రహదారి తెలంగాణతల్లి హోటల్‌ వద్ద వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతి రవి అక్కడికక్కడే మృతి చెందగా, పెద్ది రాజు ఎగిరి విద్యుత్‌ స్తంభంపై పడ్డాడు. వెంటనే  సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు గాంధీ దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. రవికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. రాజుకు భార్య ఆదిలక్ష్మి, ఒక పాప, బాబు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.   ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

VIDEOS

logo