ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు

లక్ష మెజార్టీతో సుజాతమ్మ గెలుపు ఖాయం
అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
తొగుట : దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని తొగుట మండల ఎన్నికల ఇన్చార్జి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కాన్గల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, హైదరాబాద్‌లో రూ.1.60 కోట్లు, సిద్దిపేటలో రూ.18లక్షలు పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు దుబ్బాక నియోజకవర్గంతో ఎంతో అనుబం ధం ఉందన్నారు. సోలిపేట సుజాతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జర్నలిస్టు, ఉద్యమకారుడికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు సవాల్‌కు సమాధానం చెప్పలేక బీజేపీ నాయకులు తోక ముడిచారన్నారు. బీజేపీ అంటేనే అబద్ధాల పుట్ట అని అన్నారు. నరం లేని నాలుకలా బీజేపీ, కాం గ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓట్లు వేయించుకోవాలని వెయ్యి అబద్ధాలు అడుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలన్నారు. సుజాతమ్మ కోసం శ్ర మించిన తొగుట మండలంతోపాటు అందోల్ నియోజకవర్గ, కొండపాక, నంగునూరు మం డల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆగమైన తెలంగాణకు
అండగా నిలిచిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాక ముందు సమైక్య పాలనలో ఆగమైపోయిందని, తెలంగాణ వచ్చిన తర్వాతే నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్నామన్నారు. బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి బాగా మాట్లాడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిం చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఝూటా మాటలు నమ్మొద్దన్నారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు లాంటి పథకాలు గుజరాత్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఎన్నికల్లో సీసాలు, డబ్బులు ఇస్తే మనకు కడుపు నిండుతుందా.. కాళేశ్వరం నీళ్లు వస్తే కడుపు నిండుతాయి’ అని అన్నారు. కేంద్రం రైతులను నట్టేట ముంచుతుందన్నారు. విదేశీ మక్కలు తొగుటకు అగ్వకు తెస్తున్నారని, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని, మన మక్కలు ఎవరు బుక్కుతారని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజా కొంటామన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని, బీహార్‌లో కూడా మా ప్రభుత్వం వస్తేనే డబుల్ ఇంజిన్‌లా ముందుకు సాగుతామని మోడీ సారు చెప్పినట్లు, హైదరాబాద్‌లో కారు సర్కా ర్ ఉందని, దుబ్బాకలో కూడా కారు గుర్తు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఓర్వలేకనే బీజేపీ నాయకుల
దుష్ప్రచారం: మాజీ ఎమ్మెల్యే వీరేశం
టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతమ్మ గెలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గ్రామ గ్రామాన టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు నీరాజనం పడుతున్నారని, కార్యకర్తలు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. మంత్రి హరీశ్‌రావు ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, సర్పంచ్ల, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిరినేని గోవర్ధన్, కంకణాల నర్సింహులు, సర్పంచ్‌లు ప్రతాప్‌రెడ్డి, బొడ్డు నర్సింహులు, ఎంపీటీసీ శరత్‌తోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.