స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి

దుబ్బాక : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. దుబ్బాకలో విలేకరులతో ఆయనతోపాటు పోలీసు నోడల్ అధికారి బాలాజీ మాట్లాడారు. ఈనెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా పలు చోట్ల సోదాలు, తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.58 లక్షలు సీజ్ చేశామన్నారు. కాగా, మరో రూ.రెండు లక్షలు సదరు వ్యక్తి సరైనా ఆధారాలు చూపించడంతో తిరిగి అందజేశామన్నారు. పోలింగ్ సమయంలో ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోవాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 100778 మంది మహిళలు, 97978 మంది పురుషులున్నారని తెలిపారు. 51 మంది సర్వీసు ఓటర్లున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 89 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. పోలింగ్ విధులకు 400 మంది పీవోలు, 400 మంది ఏపీవోలు, మరో 800 మంది అదనపు పోలింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 6150 మంది వృద్ధుల్లో 1340 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అంధులైన ఓటర్లకు బ్రెయిలీ లిపితో కూడిన బ్యాలెట్ పత్రాలను సిద్ధంగా ఉంచామన్నారు. కొవిడ్ హోం క్వారంటైన్లో ఉన్న 73 మంది అర్హులుగా గుర్తించామన్నారు. 315 ఈవీఎంలు ఉండగా.. అదనంగా 120 ఈవీంలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే 100 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.
తాజావార్తలు
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు