శుక్రవారం 04 డిసెంబర్ 2020
Siddipet - Nov 01, 2020 , 00:24:33

అలుపెరుగని ప్రయాణం

అలుపెరుగని ప్రయాణం

 సిద్దిపేట, నమస్తే తెలంగాణ:  ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు బిజీబిజీగా గడుపుతున్నారు. శనివారం ప్రచారం ప్రారంభించి ఐదు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. 10గ్రామాలు.. 15గంటలు.. 200కిలో మీటర్ల దూరం సుడిగాలి పర్యటించి ప్రచారం చేశారు. రాయిపోల్‌ మండలం ఎల్కల్‌, బేగంపేట్‌, వడ్డెపల్లి, రాంసాగర్‌, కొత్తపల్లిలో ప్రచారం నిర్వహించి నార్సింగి మండలంలో రోడ్‌షో, చేగుంట మండలం కొండాపూర్‌లో యువగర్జన, దుబ్బాకలో పలువురి చేరికలు, మిరుదొడ్డి మండలంలోని మోతె, కూడవెల్లి, అక్బర్‌పేట, భూంపల్లి గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు.