గురువారం 03 డిసెంబర్ 2020
Siddipet - Nov 01, 2020 , 00:24:33

మాయమయ్యే నాయకులను నమ్మొద్దు

మాయమయ్యే నాయకులను  నమ్మొద్దు

అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌

తొగుట : ఎన్నికల తర్వాత ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి దుబ్బాకలో ఉంటారా.. ఇలాంటి వారు మనకు అవసరమా..? ఎన్నికల్లో వారిని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఓటర్లకు పిలుపు నిచ్చారు. శనివారం మండలంలోని ఎల్లారెడ్డిపేట, వెంకట్‌రావుపేట, గుడికందుల, కాన్గల్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌, వేములఘాట్‌ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత మాయమయ్యే నాయకులను నమ్మొద్దన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, దవాఖానలో ఉచిత ప్రసవాలతో పాటు కేసీఆర్‌ కిట్టు తదితర పథకాలను కాంగ్రెస్‌, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణ సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా నామ మాత్రమేనన్నారు. తెలంగాణ ద్వారా పన్నుల రూపంలో పెద్ద ఎత్తున లబ్ధిపొందుతున్న కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల్లో కోత విధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రచారంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.