బుధవారం 25 నవంబర్ 2020
Siddipet - Nov 01, 2020 , 00:24:32

సమస్యలుంటే సంప్రదించాలి

సమస్యలుంటే సంప్రదించాలి

అంకిత భావంతో పనిచేసి మన్ననలు పొందారు 

పోలీసుల ఉద్యోగ విరమణలో సీపీ జోయల్‌ డెవిస్‌ 

సిద్దిపేట టౌన్‌ : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని, ఏమైనా సమస్యలుంటే తమను సంప్రదించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఐ మహ్మద్‌ఖాజా, హెడ్‌కానిస్టేబుళ్లు నాగేశ్వర్‌రావు, సత్యనారాయణల ఉద్యోగ విరమణ సభ శనివారం కమిషనరేట్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీపీ పోలీసులకు మెమోంటో అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. రిటైర్డ్‌మెంట్‌ బెన్‌ఫిట్‌ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది సేవలను మరువమన్నారు. విధి నిర్వహణలో ఎదురైన అనుభవాలను పోలీసు కమిషనర్‌ పంచుకున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వాహనంలో పోలీసులను ఇంటికి పంపారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషినల్‌ డీసీపీలు బాపురావు, రియాజ్‌ ఉల్‌హక్‌, ఏవో సవిత, ఆర్‌ఐలు డెవిడ్‌ విజయ్‌కుమార్‌, సుభాష్‌, ధరణికుమార్‌, పోలీసు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

పోలీసు చట్టం అమలు  

సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఈ నెల 15 వరకు పోలీసు చట్టం అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ముందస్తుగా పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.