బుధవారం 02 డిసెంబర్ 2020
Siddipet - Oct 31, 2020 , 00:16:18

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతీ హోళికేరి  

సిద్దిపేట కలెక్టరేట్‌: హింసాత్మక సంఘటనలకు, ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో దుబ్బాకలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని విద్యుత్‌ అతిథి గృహంలో ఎన్నికల పోలీసు పరిశీలకులు సరోజ్‌కుమార్‌ఠాకూర్‌, వ్యయ పరిశీలకులు నరేశ్‌బుందేల్‌, మనీష్‌ద్వివేదిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దుబ్బాక ఎన్నికల పోలింగ్‌కు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలకులకు వివరించారు. దుబ్బాక నియోజకవర్గం నైసర్గిక స్వరూపం, జనాభా, విస్తీర్ణం, ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణ తదితర సమాచారాన్ని వివరించారు. ఎన్నికలో మద్యం, డబ్బు పంపిణీలాంటి అక్రమాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లు చేసిన బృందాలు వారి పనితీరును వివరించారు. ప్రచారం కోసం వెచ్చిస్తున్న ప్రతి పైసాను అభ్యర్థుల ఖాతాలో జమ చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్ట అమలుకు కృషి చేస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సదుపాయాలను వివరించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.