ఎన్ఎంఎంఎస్ ఉపకారం విద్యార్థులకు వరం

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పేరిట ప్రతిభా పరీక్ష
మెరిట్ ఆధారంగా నాలుగేండ్ల పాటు స్కాలర్షిప్
దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 20
సిద్దిపేట రూరల్: భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పథకం ఆర్థికంగా వెనుకబడి, ప్రతిభావంతులైన విద్యార్థులకు చాలా ఉపయోగపడనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల డ్రాప్ అవుట్లను నివారించి విద్యలో వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేలు ఉపకార వేతనాలు అందుతాయి. పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతతో పాటు వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది.
అర్హులెవరు?
ప్రభుత్వ, జిల్లా పరిషత్, హాస్టల్ వసతిలేని ఆదర్శ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షకు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏటా రూ.1.50లక్షల కంటే తక్కువగా ఉండి, ఏడో తరగతిలో బీసీ, జనరల్ విద్యార్థులు 55 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 50శాతం మార్కులతో పాసై ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి కొవిడ్-19 దృష్ట్యా ఈ విద్యా సంవత్సరానికి పరీక్షలు జరుగనందున, ఆరో తరగతి మార్కులు పరిగణలోకి తీసుకుంటారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అనర్హులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఈ పథం కింద స్కాలర్షిప్కు అర్హులు కారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదివే వారు కూడా అనర్హులు.
దరఖాస్తు విధానం ఇలా..
అర్హులైన ఎనిమిదో తరగతి విద్యార్థులు www.bse.telangana.gov.in అనే వైబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను జత చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులు వైద్య ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలి. బీసీ, జనరల్ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాలి. నవంబర్ 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులను ఆయా పాఠశాలల హెచ్ఎంలు డీఈవో కార్యాలయంలో నవంబరు 23వ తేదీ లోగా సమర్పించాలి.
రెండు విభాగాల్లో పరీక్ష..
మెంటల్ ఎబిలిటీ(మానసిక సామర్థ్యం), అప్టిట్యూడ్(విషయ సామర్థ్యం) అనే రెండు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండింటిలో 90ప్రశ్నలతో మొత్తం 180 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 180 మార్కులు ఉంటాయి. ఏడు, ఎనిమిదో తరగతిలో ఉండే మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో నుంచి ప్రశ్నలుంటాయి. ఎన్ఎంఎంఎస్ పరీక్షా సమయం మూడు గంటలు ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులకు 30నిమిషాలు అదనంగా కేటాయిస్తారు.
తాజావార్తలు
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు