బుధవారం 02 డిసెంబర్ 2020
Siddipet - Oct 31, 2020 , 00:17:16

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

కొమురవెల్లి : మండలంలోని లెనిన్‌నగర్‌కు చెందిన ములుగు నర్సింహులు(40) శుక్రవారం పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం పొద్దున పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు చేర్యాల దవాఖానకు తరలించారు. అప్పటికే  పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనతో సిద్దిపేట దవాఖానకు తరలించారు. కాగా, వైద్యం అందిస్తున్న క్రమంలో నర్సింహులు మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.   కొద్ది కాలంగా నర్సింహులుకు అనారోగ్యంతో పాటు రూ.5లక్షలు అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.