సోమవారం 08 మార్చి 2021
Siddipet - Oct 31, 2020 , 00:17:16

వృద్ధురాలిపై యువకుడి లైంగికదాడి

వృద్ధురాలిపై యువకుడి  లైంగికదాడి

చిన్నకోడూరు :  వృద్ధురాలిపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్సై సాయికుమార్‌   వివరాల ప్రకారం.. రామంచ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద చూపించుకొని  ఇంటికి వెళ్తున్నది. అదే గ్రామానికి చెందిన కొమ్మ నర్సింహా అలియాస్‌ నర్సింహులు పెద్దమ్మ ఎక్కడికి వెళ్తున్నావని వృద్ధురాలిని పలుకరించి ఇంటికి తీసుకెళ్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. సదరు యువకుడు సిరిసిల్ల - సిద్దిపేట రహదారి పక్కన చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నర్సింహా పరారీలో ఉన్నాడని ఎస్సై వివరించారు.

VIDEOS

logo