శుక్రవారం 27 నవంబర్ 2020
Siddipet - Oct 29, 2020 , 00:08:38

ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

ప్రకటనలకు అనుమతి తప్పనిసరి

నవంబర్‌ 2, 3 తేదీల్లో ప్రింట్‌ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనల జారీకి అనుమతి తీసుకోవాలి 

కలెక్టర్‌ భారతి హోలికేరి 

సిద్దిపేట కలెక్టరేట్‌ : దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజున దినపత్రికల్లో రాజకీయ ప్రకటనల ప్రచురణకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోలికేరి తెలిపారు. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు జారీ చేసిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు మార్గదర్శకాలు విధిగా పాటించాలన్నారు. నవంబర్‌ 2, 3న ప్రింట్‌ మీడియాల్లో ప్రకటనలు జారీ చేయాలనుకుంటే ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో కానీ, సిద్దిపేట పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఇవ్వదలచిన ప్రకటన కాపీ సారాంశాన్ని జత చేసి నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకుంటే ఎంసీఎంసీ కమిటీ పరిశీలించి అనుమతి జారీ చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతిహోలికేరి పేర్కొన్నారు.