గురువారం 04 మార్చి 2021
Siddipet - Oct 29, 2020 , 00:08:37

నాలుగు పాఠశాల బస్సులు దగ్ధం

నాలుగు పాఠశాల బస్సులు దగ్ధం

సిద్దిపేట టౌన్‌ : ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన నాలుగు బస్సులకు నిప్పంటుకొని దగ్ధమైన సంఘటన సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... పట్టణంలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌ పాఠశాలకు చెందిన బస్సులను హౌసింగ్‌ బోర్డు కాలనీ రోడ్డులోని ఖాళీ స్థలంలో నిలిపి ఉంచారు. ఒక్కసారిగా బస్సులోంచి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఎగిసి పడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది   ఆర్పివేశారు. పాఠశాల యజమానుల ఫిర్యాదు మేరకు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

VIDEOS

logo