శనివారం 05 డిసెంబర్ 2020
Siddipet - Oct 28, 2020 , 00:05:30

ఓట్లడిగే నైతిక హక్కు బీజేపీ, కాంగ్రెస్‌లకు లేదు

ఓట్లడిగే నైతిక హక్కు బీజేపీ, కాంగ్రెస్‌లకు లేదు

కాళేశ్వరం జలాలతో రైతుల పాదాలను కడుగుతాం

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

గ్రామాల్లో సుజాతక్క  ప్రచారానికి బ్రహ్మరథం

రాయపోల్‌: ‘కరెంట్‌ ఇవ్వనోళ్లు ఒక దిక్కు.. మోటర్లకు మీటర్లు పెడ్తా అనేటోళ్లు మరో దిక్కు.. రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇస్తున్న సీఎం కేసీఆర్‌ ఇంకో దిక్కు.. మీరే ఆలోచించండి.. 60 ఏండ్లలో కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు చేయని అభివృద్ధి కేవలం ఆరేండ్లలోనే జరిగింది’.. అని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంగళవారం రాయపోల్‌ మండలం ముంగీస్‌పల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్‌ గ్రామా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు అందడం లేదని, రైతులకు ఉచితంగా కరెంట్‌ను ఇవ్వడం లేదని విమర్శించారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే, మోడీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలింభిస్తున్నదని మండిపడ్డారు. కాం గ్రెస్‌ 60 ఏండ్లు పాలనలో సాగు, తాగునీరు ఇవ్వలేదని, సీఎం కేసీఆర్‌ సాగునీరు అందించేందుకు మల్లన్నసాగర్‌ నిర్మిస్తున్నారన్నారు. కాళ్లేశ్వరంతో రైతుల పాదాలను కడుగుతామన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

 మీ ఆడబిడ్డను.. ఆశీర్వదించండి 

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగన్న ఆశయాలను కొనసాగిస్తానని, మీ ఆడబిడ్డను ఆశీర్వదించి, గెలిపించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత కోరారు. పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకునే రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం ఎంతో బాధ కలిగిస్తున్నదని కన్నీటి పర్యంతమయ్యా రు. కుటుంబ సభ్యుల కంటే లింగన్న ప్రజలతోనే ఎక్కువగా ఉండేవాడని, ఆయన ఆశయాలు కొనసాగించాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎంపీపీ కల్లూరి అనిత, జడ్పీటీసీ యాదగిరి, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ముం గీస్‌పల్లి సర్పంచ్‌ స్వామి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షు డు వెంకట్‌ నర్సింహారెడ్డి, రాంసాగర్‌ సర్పంచ్‌ సంధ్యారాణి, ఎంపీటీసీ లక్ష్మి, ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు మాదా సు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళిగుప్తా పాల్గొన్నారు.