శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Oct 28, 2020 , 00:05:30

వైభవంగా మహంకాళి పట్టాభిషేకం

వైభవంగా మహంకాళి పట్టాభిషేకం

గజ్వేల్‌అర్బన్‌: గజ్వేల్‌ పట్టణంలోని మహంకాళి ఆలయంలో   అమ్మవారికి సోమవారం రాత్రి పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రుల ముగింపులో భాగంగా శృంగేరి పీఠం శారదాపీఠం సంప్రదాయం ప్రకారం గజ్వేల్‌ మహంకాళికి పట్టాభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కాల్వ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు నందబాలశర్మ, సనాతనశర్మ, సాయిభార్గవశర్మ, చంద్రశేఖరశర్మ, సాయి తదితరులు అమ్మవారికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నందబాలశర్మ మాట్లాడుతూ మహిషాసురమర్ధినిగా అమ్మవారు యుద్ధంలో విజయం సాధించిన అనంతరం మణిద్వీపంలో సేదతీరుతుందని, ఆ సమయంలో దేవతలంతా వెళ్లి అమ్మవారిని స్తుతించి పట్టాభిషేకం నిర్వహిస్తారన్నారు. శృంగేరి శారదాపీఠంలో నిర్వహించిన విధంగా గజ్వేల్‌లో కూడా మహంకాళి అమ్మవారికి ప్రతి దసరా తర్వాత రోజు పట్టాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఈ పట్టాభిషేకాన్ని చూడడం, కథను వినడం వల్ల  బాధలు, కష్టాలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. అనంతరం బ్రాహ్మణ, దాతలకు సన్మానం చేశారు.

  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సి రాజమౌళి, కౌన్సిలర్‌ బాలమణి శ్రీనివాస్‌రెడ్డి, అల్వాల బాలేశ్‌, ఆలయ కమిటీ సభ్యులు కొమురవెల్లి శంకరయ్య, నేతి చిన్న శ్రీనివాస్‌, ఉప్పల రఘువీర్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo