ఆదివారం 29 నవంబర్ 2020
Siddipet - Oct 27, 2020 , 00:04:08

మెజార్టీ మీది.. అభివృద్ది మాది..

మెజార్టీ మీది.. అభివృద్ది మాది..

దుబ్బాక టౌన్‌ :

 ‘దుబ్బాకలో మెజార్టీ అందించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసి చూపే బాధ్యత సీఎం కేసీఆర్‌తో పాటు నాపై ఉంది’.. అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో ఖరారైందని, దుబ్బాక అభివృద్ధిపై పూర్తి బాధ్యత తనపై ఉందని, అందుకు ప్రజల ఆశీస్సులు అవసరమన్నారు. సోమవారం దుబ్బాక ఆర్యవైశ్య భవనంలో చింతరాజు అధ్యక్షతన ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి హరీశ్‌రావు హాజరై, మాట్లాడారు. ఎంత మెజార్టీ అందిస్తే అంత బాధ్యతతో ముఖ్యమంత్రి దగ్గర నిధులు తేవడంలో తనకు బలం పెరుగుతుందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోలిపేట సుజాతకు ఆర్యవైశ్యుల ఆశీస్సులు కావాలన్నారు. ఎన్నికలు ఉన్నా, లేకున్నా ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే సోలిపేట కుటుంబానికి అండగా నిలువాలన్నారు. దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేం దుకు సీఎం కేసీఆర్‌తో పాటు తాను, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పూర్తి బాధ్యత వహిస్తామన్నారు. దుబ్బాక ప్రాంతం గురించి అవగాహన లేని ఉత్తమకుమార్‌రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో జరిగిన ఫలితమే దుబ్బాకలో జరుగుతుందని, కానీ ఇక్కడ లక్షకు పైగా మెజార్టీ సాధిస్తామన్నారు. హుజూర్‌నగర్‌ ప్రజలు సీఎం కేసీఆర్‌ మనసు దోచుకొని రూ.300 కోట్లతో 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని సాధించుకున్నారని మంత్రి గుర్తు చేశారు. అదే తరహాలోని దుబ్బాకలోనూ అభివృద్ధిని ప్రజలు చూడబో తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతానికి చెందిన వాడు కనుక మరిన్ని ఎక్కువ నిధులు సాధించుకునేందుకు మెజార్టీ ద్వారా నైతిక బలాన్ని అందిం చాలని కోరారు. సోలిపేట సుజా త తనకు చెల్లి లాంటిదని, తాను అండగా ఉండి ఇరువురం ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. పుట్టెడు దుఖంతో ఉన్న సుజాత క్కను బీజేపీ విమర్శించడం సిగ్గుచేట న్నారు. ‘బేటీ బచావో-బేటీ పడావో’ అనే బీజేపీ నేడు ‘బేటీకో ఇజ్జత్‌దేనా సీక్‌నా చాహియే’.. అంటూ మంత్రి  ఘాటుగా విమర్శించారు. టీఆర్‌ఎ స్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వ మన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలిం గారెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఐదేండ్లలో రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిపిం చాడన్నారు. రూ.280 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు, రూ.101 కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు పనులను చేశారన్నారు. దుబ్బాకలో పెద్ద ఎత్తున నిధులతో సీఎం కేసీఆర్‌ చదివిన బడి నిర్మాణం, డబుల్‌ ఇండ్లు, చెరువుల మరమ్మతు, వెంకటేశ్వ రాలయ నిర్మాణం వంటి పనులు జరిగాయన్నారు. ఇవన్ని తెలియకుండా ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. దుబ్బాక ప్రాంతంలో రాబోయే రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు క్రమక్రమంగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఓసీలో ఉన్న పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామన్నారు. వైశ్య ఫెడరేషన్‌ ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యే గణేశ్‌గు ప్తా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గంప శ్రీనివాస్‌, ఆర్యవైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, మహాసభ జిల్లా అధ్యక్షుడు రత్నాకర్‌, యువజన విభాగం అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ఆర్యవైశ్యులకు సముచితమైన గౌరవం లభించిందన్నారు. రాజకీయ ఎదుగుదలకు సీఎం కేసీఆర్‌ కృషి చేశారన్నారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఘన విజయానికి తమవంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితభూంరెడ్డి, స్థానిక నాయకులు నల్ల నాగరాజం, దయానంద్‌, పడకంటి రాజు, కూర వేణు, చింతకింది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్ష ఓట్లే లక్ష్యంగా యువత కృషి చేయాలి..

దుబ్బాకలో సోలిపేట సుజాతక్కకు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు యువతను కోరారు. సోమవారం స్థానిక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పలు గ్రామాలకు చెందిన యువకులు బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దుబ్బాకకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు బింగి ప్రభాకర్‌, రాజిరెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన పాతూరి లక్ష్మారెడ్డిల ఆధ్వర్యంలో సుమారు 25 మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా రాయపోల్‌ మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు సుమారు 50 మంది, పల్లెపహాడ్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు, యువజన విభాగం నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి తదితరులు ఉన్నారు. 

మంత్రి సమక్షంలో 50మంది కాంగ్రెస్‌ కార్యకర్తల చేరిక

రాయపోల్‌ : మండలంలోని చిన్నమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, కిసాన్‌ సెల్‌ మండలాధ్యక్షుడు రేకుల లక్ష్మారెడ్డి తన అనుచరులు 50మందితో కలిసి సోమవారం సిద్దిపేటలోని మంత్రి నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని, కాంగ్రెస్‌లో గ్రూప్‌ విభేదాలున్నాయని, కష్టపడి పని చేసే నాయకులకు గుర్తింపు లేకుండా పోయిందని, ప్రజ సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తము టీఆర్‌ఎస్‌లో చేరినట్లు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు రాజిరెడ్డి, మండల నాయకులు కల్లూరి శ్రీనివాస్‌ తదిరులు ఉన్నారు. అలాగే, దుబ్బాక రెడ్డి సంఘంలో సోమవారం సాయంత్రం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గంభీర్‌పూర్‌ రెడ్డి సంఘం నాయకులు సంఘం నాయకులు రేపాక శ్రీనివాస్‌, కురుణాకర్‌, దేవిరెడ్డిలతో పాటు 50 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.