శుక్రవారం 04 డిసెంబర్ 2020
Siddipet - Oct 27, 2020 , 00:04:07

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

సిద్దిపేట టౌన్‌ : అధికారులు.. సిబ్బంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తూ.. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. విజయదశమి పురస్కరించుకొని సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పెద్దకోడూరు ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధాలు, ప్రభుత్వ వాహనాలను పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూజాకార్యక్రమంలో అడిషనల్‌ ఏఆర్‌ డీసీపీలు బాపురావు, ఆర్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, ధరణికుమార్‌, ప్రదీప్‌, శ్రీకాంత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

తాజావార్తలు