గురువారం 03 డిసెంబర్ 2020
Siddipet - Oct 25, 2020 , 00:12:18

సద్దుల సంబురం

సద్దుల సంబురం

సద్దుల బతుకమ్మ పండుగను దుబ్బాక, మద్దూరు, చేర్యాల, మిరుదొడ్డి, కొమురవెల్లి, తొగుట, దౌల్తాబాద్‌ మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. దుబ్బాకలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వనితాభూంరెడ్డి  స్థానిక పోచమ్మ ఆలయం వద్ద తోటి మహిళలతో పాల్గొన్నారు. చేర్యాల పట్టణంలోని కుడి చెరువు వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపరాణి ఆధ్వర్యంలో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. మిరుదొడ్డితో పాటు మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కొమురవెల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో  సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉద యం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి మహిళలు బతుకమ్మ ఆడుతూ రాత్రి వరకు సందడి చేశారు. చెరువులు, కుంటల వద్ద మహిళలు గౌరమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేసి పోయిరావమ్మ బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికారు.  

- దుబ్బాక టౌన్‌ /మద్దూరు /చేర్యాల /మిరుదొడ్డి / కొమురవెల్లి /తొగుట/ దౌల్తాబాద్‌